info.manatemples@mail.com

+91 9866933582

కనక దుర్గమ్మ దేవాలయం -విజయవాడ




శక్తి స్వరుపిని , అమ్మలగన్నయమ్మ్ ముగ్గరమ్మల మూలపుటమ్మ కనకదుర్గమ్మ ఇంద్ర కీలాద్రి పైన స్వయంభు గ వెలసి విజయశక్తులు తనలో ఉండి ,ఇంద్రాది దేవతలచే పూజలందుకుంటున్న అపరశక్తి కనకదుర్గమ్మ తల్లి .


మన రాష్ట్రము లో శరన్న నవరాత్రులు అనగానే గుర్తుకు వచ్చేది విజయవాడ అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు. వివిధ అలంకారాలతో అమ్మవారు మనకు దర్శనం ఇస్తారు .


ఇంద్రకీలాద్రి పర్వత పాదబాగాన్ని తాకుతూ , పరవళ్ళు తొక్కే కృష్ణవేణి చెంతగల ఈ పర్వతానికి పెరురావడానికి కూడా ఒక ఇతిహాసం ఉంది . పూర్వం కీలుడు అనే యక్షుడు ఆది పరాశక్తి కొరకు తపస్సు చేయగా అమ్మవారు ప్రత్యక్షమై వరం కోరుకో మనగ అప్పుడు యక్షుడు అమ్మ నువ్వు ఎల్లప్పుడు నా పై నివసించు ఉండు అని వరం కోరుకుంటాడు . అందుక దుర్గాదేవి నివు ఈ పరమ పవిత్రమైన కృష్ణానది ఒడ్డున పర్వత రూపాన్ని దరించు అప్పుడు నేను ని పైన ఉంటాను అని చెప్పగా యక్షుడు ఆలాగే మారిపోతాడు .


కీలుడు పర్వత రూపాన్ని దరించి అమ్మ వారి కోసం ఎదురు చూడగా మహిససురున్ని సంహరించాక దుర్గాదేవి కీలాద్రి పైన కొలువు తీరింది అని స్థల పురాణం చెబుతుంది . మహిసాసుర మర్ధిని కొలువున్న కీలాద్రి పర్వతం మీదికి ఇంద్రాది దేవతలంత వచ్చి దేవికి పూజలు చేయసాగారు ఆనాటి నుండి ఈ కీల పర్వతానికి ఇందిరాకీలద్రి అని పేరు వచ్చింది .


ఆశ్విజ శుద్ధ పాడ్యమి నుండి దశమి వరకు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రతి ఏడాది జరుగుతాయి .


కనక దుర్గాదేవి ( పాడ్యమి )
శ్రీ బాల త్రిపుర సుందరి ( విదియ )
శ్రీ అన్నపూర్ణ దేవి (తదియ )
శ్రీ గాయత్రి దేవి ( చవతి )
శ్రీ లలిత త్రిపుర సుందరి ( పంచమి )
శ్రీ మహాలక్ష్మి దేవి ( షష్టి )
శ్రీ సరస్వతి దేవి ( సప్తమి )
శ్రీ దుర్గాదేవి ( అష్టమి)
శ్రీ మహిససురమర్ధిని దేవి ( నవమి )
శ్రీ రాజ రాజేశ్వరి దేవి ( దశమి)