info.manatemples@mail.com

+91 9866933582

హంపి-దేవాలయాలు


13-15వ శతాబ్ధములో విజయనగర సామ్రాజ్య రాజధాని ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారి జిల్లాలోని ఒక చిన్న పట్టణం. విద్యారణ్య స్వామి ఆశిస్సులతో స్థాపించడిన విజయనగరసామ్రాజ్యానికి విజయనగరం లేదా హంపి రాజధాని. దక్షిణ భారతదేశములోని అతి పెద్ద సామ్రాజ్యాలలో విజయంగరసామ్రాజ్యం ఒకటి. . రాయల వారు రాజ్యమేలిన దేశం !! అడుగడుగునా దేవాలయాలే ,అద్బుతమైన కట్టడాలు ,అపురూపమైన శిల్పాలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవా అన్న విదంగా ఉంటాయి .అందమైన తుంగ భద్ర నది అడుగులు వేసే ప్రదేశం !హరి హరాదులు అంటే రాయలవారికి ఎంతో బక్తి అందుకే తన రాజ్యం లో అడుగడుగునా హరి-హర క్షేత్రాలను నిర్మించాడు .అందమైన హంపి ప్రయాణం లో చుసిన అద్బుతమైన క్షేత్రాలు
రంగనాథ స్వామి దేవాలయం :-అనేగుండి



వందల సంవత్సరాల చరిత్రగల ఈ దేవాలయం లో ఆ రంగనాథుడు ఎంతో అందంగా,చూడ చక్కగా ఉంటాడు . ఈ క్షేత్రం లోనే రాయల వారి తరానికి సంబదించిన కుటుంబీకులు ఉండేవారు అట.

నవబృందావనం :-



అనేగుండి సమీపం లో నే నిర్మించబడిన నవ బ్రిందవనం లో మద్వా సంప్రదాయానికి చెందిన గురువులా బృందావనలు కొలువై ఉన్నాయి.

విజయ లక్ష్మి దేవాలయం :



పంప సరోవరం సమీపం లో వెలసిన మహిమన్మిహ్తమైన లక్ష్మి దేవి కొలువైన ప్రదేశము . ఆలయానికి కింద బాగం లో ఉన్న పంప సరోవరం ఎంతో చూడ చక్కగా ఉంటుంది.

అంజనాద్రి దేవాలయం :-



సుమారు ఆరువందల అడుగుల ఎత్తులో ఉన్న ఈ దేవాలయం ఆంజనేయుడికి పుట్టిన స్థలము అని చారిత్రక ఆదారాలు చెబుతున్నాయి . కొండ పైన నుండి విక్షిస్తే హంపి నగరం ఎంతో సుందరంగా కనిపిస్తుందో !! వేల సంవత్సరాల చరిత్ర గల ఈ దేవాలయం ఆద్యాత్మిక నిలయం .
పట్టడకల్ దేవాలయాల సముదాయం :-



చాళుక్యుల కాలం లో నిర్మించబడిన ఎన్నో దేవాలయాలు మనకు ఇక్కడ కనిపిస్తాయి . ఈ ప్రాంగణం లో మనకు విరుపాక్ష దేవాలయం ,సంగమేశ్వర దేవాలయం ,చంద్రశేకర దేవాలయం ,మల్లికార్జున దేవాలయం ,కాసివిస్వనత దేవాలయం ,గలగనాథ దేవాలయం ,కదసిద్దేస్వర ,జంబులింగం ,పాపనాత దేవాలయం మనకు ఇక్కడ కనిపిస్తాయి అన్ని దేవాలయాల్లో విగ్రహాలు ధ్వంసమయ్యాయి .

విట్టాల దేవాలయం :-



15 వ శతాబ్దం లో నిర్మించిన ఈ దేవాలయం ఎంతో సుందరంగా ఉంటుంది . శ్రీ మహా విష్ణువు ప్రతిరూపమైన విట్టాల రూపం . అద్బుతమైన శిల్ప సంపద ,విశాలమైన ప్రాంగణము ,స్థంబాల పైన చెక్కబడిన శిల్ప రూపాలు ఎంతో గాను ఆకట్టుకుంటాయి . ఒకప్పుడు ఎంతో చరిత్రాత్మకమైన దేవాలయాలు ప్రస్తుతం అన్ని సితిలవస్తలో ఉన్నాయి . అంతరాలయం , రథము అడుగడుగునా ఎంతో విశేషంగా ఉంటాయి .

విరుపాక్ష దేవాలయం :-



హంపి వీధి కి పశ్చిమ చివర విరూపాక్ష దేవాలయం ఉన్నది. 50 మీటర్ల ఎత్తు ఉన్న తూర్పు గాలి గోపురం విరూపాక్ష దేవాలయం లోనికి స్వాగతం పలుకుతుంది.దేవాలయం లో ప్రధాన దైవం విరూపాక్షుడు(శివుడు). ప్రధాన దైవానికి అనుసంధానంగా పంపాదేవి గుడి, భువనేశ్వరీ దేవి గుడి ఉంటుంది. ఈ దేవాలయానికి 7 వ శతాబ్దం నుండి నిర్విఘ్నమైన చరిత్ర ఉన్నది. విరూపాక్ష-పంపా ఆలయం విజయనగర సామ్రాజ్యం కంటే ముందు నుండి ఉన్నదని శిలాశాసనాలు చెబుతున్నాయి. 10-12 శతాబ్దంకు చెందినవి అయి ఉండవచ్చని చరిత్రకారుల అంచనా. చరిత్ర ఆధారాల ప్రకారం ప్రధాన దేవాలయానికి చాళుక్యుల, హోయ్సళ పరిపాలన మార్పులు చేర్పుల జరిగాయని అయితే ప్రధాన ఆలయం మాత్రం విజయనగ రాజు లే నిర్మించారని అంటారు ఈ దేవాలయానికి 3 ప్రాకారాలు ఉన్నాయి. 9 ఖానాలతో 50 మీటర్ల ఎత్తు ఉన్న తూర్పు గోపురములోని రెండు ఖానాలు రాతితో నిర్మించబడ్డాయి. తుంగభద్రా నది నుండి ఒక చిన్న నీటి ప్రవాహం ఆలయంలోకి ప్రవేశించి గుడి వంట గదికి నీరు అందించి బయటి ప్రాకారం ద్వారా బయటకు వెడుతుంది. ఈ ఆలయ అభివృద్ధిలో శ్రీ కృష్ణదేవరాయల పాత్ర ఎంతో ఉన్నదని లోపలి ప్రాకారం ఉన్న స్తంభాల వసారాలోని శిలాశాసనాలు చెబుతున్నాయి.

వెళ్ళు మార్గం : - కర్ణాటక లోని హోస్పేట నుండి ఇక్కడికి సులువుగా వేల్లవొచ్చు .