శ్రీరంగనాధ స్వామి ఆలయం , శ్రీరంగపట్టణం
శ్రీరంగనాధ స్వామి ఆలయం కర్నాటక రాష్ట్రం లోని మండ్య ప్రాంతామ్ లోని శ్రీరంగపట్టణం లో కావేరి నది పక్కన కలదు.ఈ ఆలయాన్ని 9వ శతాబ్దంలో గంగ వంశపు రాజులు నిర్మించారు.హోయసల, విజయనగర శైలిలో దేవాలయామ్ యెంతో ఘనంగా వెలిగిన క్షేత్రం.
శ్రీరంగనాధ స్వామి ఆలయంలో వెలసిన రంగనాధస్వామి పేరున శ్రీరంగపట్టణం అనే పేరు వచ్చింది.
ప్రసిద్ధి గాంచిన పంచ రంగ క్షేత్రాలలో శ్రీరంగనాధ స్వామి ఆలయం ఒకటి.ఇక్కడ వెలసిన స్వామి వారిని అది రాగనత స్వామి గా కూడా పిలుస్తారు .
శ్రీరంగనాధునికి నిర్మించిన మూడు గొప్ప నిర్మాణ చాతుర్యం గల ఆలయాలలో శ్రీరంగనాధ స్వామి ఆలయం ఒకటి.అద్భుతమైన నిర్మాణాలు ,చూడ చక్కని గాలి గోపురాలు మనను యెంతో గాను ఆకట్టుకుంటాయి .స్వామి వారు అది శేసుని పై శయాణిస్తూ లక్ష్మి అమ్మ వారి తో కొలువై ఉన్నారు .
ఇంకా ఇ ఆలయం లో నరసింహ స్వామి ,వేణుగోపాల స్వామి ,ఆంజనేయ స్వామి ,గరుడ విగ్రహాలు మనకు ధర్శనమిస్తాయి. ప్రతి ఒక్కరూ తప్పకుండా దర్శించాల్సిన క్షేత్రం ఇది.
ఏలా వెళ్ళాలి :- మైసూరు కు 13 కి.మీ. దూరంలో గల ఈ నగరం, మాండ్య లో గలదు. ఈ పట్టణం మొత్తం కావేరీ నది చే చుట్టబడియున్నది. ఇదో ద్వీపంలా కనబడుతుంది.
Route Map:-