info.manatemples@mail.com

+91 9866933582

నెమలి గుండ్ల రంగనాయక స్వామి దేవాలయం - గిద్దలూరు




ప్రకాశం జిల్లా రాచెర్ల మండల కేంద్రం లోని గిద్దలూరు తాలుక లో గల నల్లమల అడువల్లో వెలసిన ప్రసిద్ద రంగనాయక స్వామి దేవలయమే “ నెమలి గుండ్ల రంగనాయక స్వామి దేవాలయం”. చుట్టూ దట్టమైన అడవి,గల గలా పారే నిటి సెలయేర్లు ఎంతో రమణీయమైన క్షేత్రం .ప్రతి ఒక్కరి జీవిత కాలం లో ఒక్కసారి అయిన ఇలాంటి క్షేత్రాన్ని దర్శించి తీరాల్సిందే .


స్థల పురాణం :-
----------------
మయూర మహర్షి గోరా తప పలమే ఈ క్షేత్ర ఆవిర్భావం అని పురాణాల ద్వార తెలుస్తుంది . శ్రీ మహా విష్ణువు కోసం ఘోరమైన తపస్సు చేసి అక్కడ తన ముక్కు తో నెమలి ఆకారం లో గుండం తవ్వడం ఆ తరువాత రోజే అది నిటి తో నిండిపోవడం అక్కడే రంగనాయక దేవాలయం ననిర్మాణం జరిగింది అని చారిత్రక ఆదారాల ద్వారా తెలుస్తుంది .


నెమలిగుండాన్ని 'గుండ్లకమ్మ' జన్మస్థానం అని అంటారు. ఏడాది పొడవునా ఈ జలపాతం జాలువారుతూనే ఉంటుంది. ఎత్తైన కొండలు, జాలువారే జలపాతం, ప్రకృతి సౌందర్యం అద్భుతంగా ఉంటుంది


వెళ్ళు మార్గం :- నెమలిగుండం వెళ్లాలంటే గిద్దలూరు, మార్కాపురం, నంద్యాల ప్రాంతాల నుండి ప్రతి శనివారాలలో బస్సులు ఉంటాయి. కానీ చాలా తక్కువగా నడుతాయి. అయితే గిద్దలూరు నుండి ప్రవేట్ ఆటోలు ఉంటాయి. ప్రయాణ సమయం : గంట లేదా గంటన్నర. గిద్దలూరు లో రైల్వే స్టేషన్ కలదు.












Route Map:-