info.manatemples@mail.com

+91 9866933582

శ్రీ రంగనాథ స్వామి దేవాలయం, శ్రీ రంగాపురం




మహాబుబనగర్ జిల్లాలోని పెబ్బైర్ కి 7 కి మీ దూరం లో ఉన్న శ్రీ రంగాపురం లో వెలసిన రంగనాథ స్వామి దేవాలయం చాల పురాతనమైనది మరియు మహిమన్మితమైన క్షేత్రం .
శ్రీ దేవి ,భూదేవి సమేతంగా కొలువైన రంగనాథుని దర్శనం ఎన్నో జన్మల చేసుకున్న పుణ్యము . స్వయం భు గ వెలసిన క్షేత్రం ఇది.శేష తల్పం పైన యోగ నిద్రలో కొలువైన నారాయణుడే శ్రీ రంగనాథుడు


స్థల పురాణం :-
----------------
1662 లో వనపర్తి సంస్థానానికి చెందినా రాజు శ్రీ రంగం లోని స్వామి ని దర్శించుకొని తన రాజ్యం లో అటువంటి దేవాలయం ఉంటె చాల బావుటుంది అని మనసులో అనుకున్నాడట . అంత లో ఒకనాటి రాత్రి స్వామి వారు రాజు స్వప్నం లో సాక్షాత్కరించి మీ రాజ్యం లో వెలసి ఉన్నాను అని స్వప్నం లో చెప్పి మార్గ నిర్దేశనం చేసాడు . రాజు వారు దానిని అనుసరించి వెళ్లి త్రవ్వగా శ్రీ రంగనాథుని విగ్రహం దొరికింది అట.


ఆలయ ఆవరణ లో ఉన్న గాలి గోపురాలు,ధ్వజ స్థంబం,కళ్యాణ మంటపం,ఆలయ నిర్మాణ శైలి,స్థంబాల పైన చెక్కబడిన శిల్పకళ ఎంతో ఆకర్షనీయంగా ఉంటుంది. శ్రీ రంగాపురం రంగనాథ స్వామి దేవాలయం తమిళనాడు లోని శ్రీ రంగాన్ని పోలి ఉంటుంది


ఆలయం లో కొలువైన ఉపలయాలు
గర్భాలయానికి ఎడమ బాగాన చతుర్బుజ తాయారు దేవాలయం
సీతారామచంద్ర స్వామి దేవాలయం



ప్రత్యేక కార్యక్రామాలు :-
పాల్గుని పౌర్ణమి కి స్వామి వారి బ్రమోత్సవాలు జరుగుతాయి . ధనుర్మాస ఉత్సవాలు,వైకుంట ఏకాదశి కి ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి












Route Map:-

Support Us:

||

Donate