నెల్లూరు జిల్లా పెన్నా నది తీరన వెలసిన ప్రసిద్ద వైష్ణవ క్షేత్రం తల్పగిరి రంగనాథ స్వామి దేవాలయం.
పల్లవులు 7 వ శతాబ్దం లో విగ్రహన్ని ప్రతిస్తించగా 12 వ శతాబ్దం లో చోళులు దేవాలయాన్ని నిర్మించారు అని శాసనాలు చెబుతున్నాయి .
రంగనాధస్వామిని విష్ణువు ప్రతి రూపంగాను, రంగనాయిక అమ్మవారిని లక్ష్మీదేవి ప్రతి రూపంగాను అభివర్ణిస్తారు. మహాకవి తిక్కన ఈ దేవాలయంలోనే మహాభారతాన్ని తెలుగులోకి అనువదించాడు.12వ శతాబ్దానికి చెందిన ఈ దేవాలయం మొదట శ్రీ వైకుంఠంగా పిలవబడేది.17వ శతాబ్దం తరువాత ఈ దేవాలయం శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందింది.
ఇక్కడ స్వామి వారు దక్షిణం దీషగా శిరస్సుంచి పచిమముఖంగా శేసశాల్ప శాయనుడై బక్తుల సేవలు ఆడుకుంటున్నాడు . ఏకాదశి ,ధనుర్మాసం లో ఇక్కడ విశెసమైన పూజ కార్యక్రమాలు నిర్వహించాబడుతాయి .
ఈ దేవాలయానికి సంబంధించిన గాలి గోపురం 7 అంతస్థులుగా నిర్మితమై సుమారు 95 అడుగుల ఎత్తు ఉంటుంది.
ఈ గాలి గోపురంపై భాగాన బంగారు పూత పూసిన 7 కలశములు ఉంటాయి.ఈ గోపురంపై అనేక దేవతా విగ్రహాలను అందంగా తీర్చిదిద్దారు. గర్భగుడిలోకి ప్రవేశించే ఉత్తర ద్వారాన్ని ముక్కోటి ఏకాదశి నాడు మాత్రమే తెరచి వుంచుతారు.
శ్రీ తల్పగిరి రంగనాథ స్వామికి ప్రతి సంవత్సరం మార్చి లేదా ఏప్రిల్ నెలలో బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు.
ఈ దేవాలయంలోని అద్దాల మండపం ఇక్కడికి వచ్చే భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఈ అద్దాల మండపంలో సీలింగ్ కు చిత్రించిన శ్రీ కృష్ణుని తైల వర్ణ చిత్రం మనం ఎటువైపు నిలబడి చూసినా మనవైపే చూస్తున్నట్లుగా మనల్ని మంత్ర ముగ్ధులను చేస్తుంది.