శ్రీరంగనాయక స్వామీ దేవాలయం, బెజ్జూర్
తెలంగాణా రాష్ట్రము లోని ఆదిలాబాద్ జిల్లా కేంద్రం లో గల బెజ్జూర్ మండల కేంద్రం లో కొలువైన శ్రీ రంగనాయక స్వామి దేవాలయం ఎంతో విశిష్టతను కలిగిన పురాతన దేవాలయం .
స్వామి వారు ఇక్కడ శేషతల్పం పైన శయనించి నాభి మధ్యమున బ్రహ్మ ను కలిగి అనంతా దేవత మూర్తులు లతో
ఉండు విగ్రహము మనకు ఇక్కడ దర్శనం ఇస్తుంది . ఇటువంటి విగ్రహం మనకు మరి ఎక్కడ కనిపించదు . ఈ ఆలయం ఉత్తరాద్వారాన్ని కలిగి ఉండడం వలన ఎంతో విశిష్టత ను సంపాదించుకున్నది .
బెజ్జురు కి తూర్పున ప్రాణహిత నది ప్రవహిస్తుంది అది ఇక్కడ మోదులై ఇక్కడ పరివాహకం లోనే గోదావరి లో కలిసిపోతుంది . ప్రతి సంవత్సరం వైకుంట ఏకాదశికి ఇక్కడ మూడు రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి .
ప్రతి ఒక్కరు దర్సించాల్సిన క్షేత్రం ఇది . ముక్కోటి ఏకాదశి కి ఇక్కడ విశేషమైన పూజ కార్యక్రమాలు నిర్వహించాబడుతాయి .