info.manatemples@mail.com

+91 9866933582

కోటేస్వర శివలింగాల దేవాలయం -కోటిలింగాల గ్రామం




మహారాష్ట్రలో ని నాసిక్ కి 18 కి మీ దూరం లో గల సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో త్ర్యంబకేశ్వరం వద్ద బ్రహ్మగిరి శికారం పైన జన్మించి త్ర్యంబకం లో ని గోముఖం గుండా సన్నని ధారా ప్రవాహంగా గోదావరి ప్రారంబం అవుతుంది . అలా ప్రవహిస్తూ చిన్న చిన్న వాగులు,వంకలు ,ఉపనదులను కలుపుకుంటూ తెలంగాణాలోని నిజామాబాదు జిల్లలో లో కందుకుర్తి దగ్గర తెలుగు నెలా పైన అడుగిడుతుంది . హరిద్ర ,మంజీరా లను కలుపుకొని చదువుల తల్లి బాసర లో జ్ఞాన సరస్వతిని ముద్దాడి , కరీంనగర్ లోని ధర్మపురి,కాళేశ్వరం లోని ముక్తేశ్వర ని దర్శించుకొని ఖమ్మం జిల్లాలోని భద్రాద్రి లో రాముల వారిని సేవిస్తూ మెల్లగా అడుగులేస్తూ తెలంగాణా నెలా పైన సెలువు తీసుకోని ఆంధ్ర ప్రదేశ్ లో అడుగిడి పాపికొండ ల మద్య ఆటలాడుతూ ,పాటలడుతూ పట్టిసీమ వీరభద్రుని చెంతలో చేరి పిమ్మట రాజమహేంద్రవరానికి చేరుకొని అక్కడ సేద తీరి చివరగా అన్త్రవేది నరిసంహ స్వామి దర్శించుకొని సముద్రం లో కలిసిపోతుంది. గోదావరి నది ఏడు పాయలుగా వీడిపోయి సముద్రం లో కలుస్తుంది. అందమైన గోదావరి నది లో ప్రయాణం ,ఆ నీళ్ళలో ఉన్న మహత్యం మనకు దొరకడం మన తెలుగు వాళ్ళం ఎన్ని జన్మల్లో చేసుకున్న పుణ్య ఫలమో .
రేవా నది తీరాన స్నానం చేస్తే ముక్తి వస్తుంది , గంగ తీరం లో స్నానం చేస్తే మోక్షం లబిస్తుంది , కురు క్షేత్రం లో దానం చేస్తే ముక్తి లబిస్తుంది , ఈ మూడు నదుల్లొ చేసే పుణ్య ఫలం ఒక గోదావరి నది లో చేస్తే లబిస్తుంది .



కరీంనగర్ జిల్లా వెలగటూరు మండల కేంద్రం లో గల కోటిలింగాల గ్రామా మ లో వెలసిన కోటేశ్వర సిద్దేశ్వర శివ లింగాలు చాల మహిమన్మితమైనవి .అందమైన గోదావరి నది కి ఇది ఉత్తారం వైపు ఉంటుంది .


చాల పురాతనమైన దేవాలయం . శాతవాహనులకు ఈ ప్రాంతమే ఒకాప్పుడు రాజదాని గ ఉండేది అని చెబుతారు. ఈ క్షేత్రం లో కోటేశ్వర,సిద్దేశ్వర లింగాలు ఉండేవి కాలక్రమేనా అవి కోటిలింగాల క్షేత్రం గ ప్రసిద్ది గాంచింది . కరీంనగర్ జిల్లా లో ప్రసిద్ది గాంచిన శైవ క్షేత్రం ఇది .






వెళ్ళు మార్గం :
కరీంనగర్ -లక్షెట్టిపేట వెళ్ళే మార్గం లో ౩ కి మీ దూరం లో ఈ క్షేత్రం ఉంటుంది