శ్రీ జనార్ధన స్వామి దేవాలయం ,ధవళేశ్వరం, రాజమండ్రి
రాజమండ్రికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న జనార్దనస్వామి ఎంతో పురాతనమైనది మరియు గోదావరి నది తీరాన వెలసిన పరమ పవిత్ర వైష్ణవ క్షేత్రం. చాళుక్యులు కాలం లో ఈ దేవాలయం నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది . నవ జనార్దనులు ఉబాయ గోదావరి జిల్లలో కొలువై ఉన్నారు (దవలేశ్వరం,కోటిపల్లి, కోరుమిల్లి,కపిలేస్వరం,ఆలమూరు,మాచర ,మండపేట,జొన్నాడ,మడికి)
గోదావరి సమీపంలో ఎత్త్తెన కొండ మీద నిర్మించిన ఆలయం... ఆధ్యాత్మిక తేజస్సుతో విరాజిల్లుతోంది. జనార్దనుడు ఇక్కడ శ్రీదేవి, భూదేవి సమేతుడై దర్శనమిస్తాడు.
క్షేత్ర పురాణం ప్రకారం నారద మహాముని స్వయముగా స్వామి ని కొలిచాడు అని ప్రతి నిత్యం కాశి నుండి గంగ జలాన్ని తెచ్చి అభిషేకిన్చేవాడట. నేనైతే మంత్రశక్తి తో వెళ్లి తెగలుగుతున్నాను కాని కలియుగం లో సాదారణ మానవుల పరిస్థితి ఏంటి అని అలోచించి గౌతముని ద్వారా గోదావరి జన్మించేల చేసాడు అని పురాణం గాథ. జనార్ధన స్వామి కోసమే గోదావరి పుట్టింది అని కూడా చెబుతారు .
ఈకొండ మీదే, ఓ గుహలో సంతాన గోపాలస్వామి వెలిశాడు. సంతానంలేని దంపతులు స్వామిని కొలిస్తే... పండంటి పిల్లలు పుడతారని భక్తుల విశ్వాసము .
త్రేతా యుగం లో శ్రీ రామ చంద్రుడు రావణున్ని చంపక బ్రహ్మ హత్యాపాతకన్ని పోగొట్టుకోడానికి ఈ క్షేత్రానికి వచ్చాడని తన వెంట వచ్చిన హనుమని క్షేత్ర పాలకుని గ ఉండమని అదేశించాడట అప్పుడు హనుమ నువ్వు లేనిది నేను ఉండలేను స్వామి అని అనగా అప్పుడు శ్రీ రామ చంద్రుడు తన పాదముద్రలను వదిలి వెళ్ళాడట అందుకే ఈ ప్రదేశాన్ని రామపద క్షేత్రంగాను పిలుస్తారు .
ఈ క్షేత్రం లో వెలసిన ఇతర దేవాలయాలు :-
అగస్త్యేశ్వర స్వామి ఆలయం పురాతన స్వయంభూ శివాలయం. శ్రీ అగస్త్యేశ్వర స్వామి అనే ముని వల్ల శివలింగం ఉద్భవించినది గనుక, ఈ గుడి ని అగస్త్యేశ్వర స్వామి ఆలయం అని అంటారు.
అంకాలమ్మ-ముత్యాలమ్మ దేవాలయం
ప్రత్యేక పూజలు /కర్యాక్రమాలు :-
భీష్మ ఏకాదశి రోజున జనార్దన క్షేత్రంలో భవంగా రథోత్సవం జరుగుతుంది. కార్తీక, ధనుర్మాసాల్లో ప్రత్యేక పూజలూ వ్రతాలూ నిర్వహిస్తారు. మిగతా రోజుల్లోనూ వైఖానస ఆగమశాస్త్ర ప్రకారం ఉదయాస్తమాన పూజలు నిర్వహిస్తారు. కొండపైకి వెళ్లేదారంతా శ్రీమహావిష్ణు స్వరూపంగా కొలుస్తారు భక్తాదులు. రాజమండ్రి నుంచి బస్సులూ ఆటోలూ పుష్కలంగా ఉంటాయి.
Special Poojas and Festivals
How to Reach:
----------------------
By Bus: Buses are available from all major places in Andhra Pradesh and Hyderabad. Rajahmundry is the nearest city which is 8 km away.
By Train: Nearest railway station is Rajahmundry Railway Station which is 5 km away. Bus services are available to reach the temple.
By Flight: Nearest airport is Rajahmundry Airport which is 21 km away. Bus and taxi services are available to reach the temple.