హేమాచల లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం
వరంగల్ జిల్లా మంగపేట మండల కేంద్రం లో గల మల్లూర్ ఘాట్ దగ్గర వెలసిన స్వయం భు లక్ష్మి
నరసింహ క్షేత్రం ఇది . ఈ క్షేత్రం చాల పురాతనమైనది మరియు మహిమన్మితమైనది . చుట్టూ అడవి
మద్యలో మెట్లు ఎక్కుతూ పైకి వెళ్లి స్వామి వారిని దర్శనం చేసుకోవడం చాల రమణీయంగా ఉంటుంది
. యోగానంద నరసింహ స్వామి మరియు లక్ష్మి దేవితో కొలువై ఉన్న ఈ క్షేత్రం లో హనుమ ద్వారా
పాలకుడై ఉన్నాడు . చుట్టూ దట్టమైన కొండల పైన వెలసిన ఈ క్షేత్రం లో చింతమాని పుష్కరిణి
ఉంది . కొండ పై నుండి చింతమాని ధర ప్రవహిస్తుంది .ఎల్లప్పుడు ఇక్కడ నీరు ఉంటుంది .
భద్రాది నుండి గోదావరి ఎదురుగా సుమారు 90-100 కి మీ దూరం లో గల మల్లూరు నరసింహ క్షేత్రం
ను హేమాచల లక్ష్మి నృసింహ క్షేత్రం (హేమాద్రి) అని పిలుస్తారు.ఇక్కడ ఉన్న ఉగ్రనరసింహ
మూర్తి 9 అడుగుల ఎత్తు గల నరహరి అష్ట బుజములతో విరాజిల్లుతూ భక్త కోటికి దర్శనం ఇస్తున్నాడు
. ఈ క్షేత్రం చాల మహిమన్మితమైన క్షేత్రం మరియు స్వామి ని దర్శించుకుంటే అన్ని రకాల
బాదలు ,దోషాలు పోతాయని భక్తుల విశ్వాసం .
వైశాక శుద్ధ పౌర్ణమి నుండి స్వామి వారి కళ్యానోత్సవములు నిర్వహించబడును . చాల మంది
భక్తులు స్వామి వారి కళ్యాణోత్సవానికి వస్తారు.
వెళ్ళు మార్గం : - మంగపేట్ కి సుమారు 5 కి మీ దూరం లో ఉన్న ఈ క్షేత్రం ఎటూరునాగారం
-భద్రాచలం వెళ్ళు మార్గం లో వస్తుంది .
వెళ్ళు మార్గం : -
మంగపేట్ కి సుమారు 5 కి మీ దూరం లో ఉన్న ఈ క్షేత్రం ఎటూరునాగారం -భద్రాచలం వెళ్ళు మార్గం
లో వస్తుంది .
Route Map :-