info.manatemples@mail.com

+91 9866933582

సరస్వతి క్షేత్రం - అనంత సాగర్్


శరదిందు సమకారే ! పరబ్రహ్మ స్వరూపిని !! వాసర పీట నిలయే ! సరస్వతి నమోస్తుతే !!



మెదక్ నుండి 63 కి మీ దూరం లో చిన్నకోడూర్ మండలకేంద్రం లో అనంత సాగర్ అని గ్రామం లో ఈ క్షేత్రం వెలసి ఉన్నది. ఈ దేవాలయం సిద్దిపేట నుండి కరీం నగర్ మధ్యలో కొలువై ఉంది. ఇది హైదరాబాదు నుండి 125 కి.మీ దూరంలోనూ, మెదక్ నుండి 63 కి.మీ దూరం లోనూ ఉంది. ఈ అనంతసాగర్ గ్రామశివార్లో ఒక చిన్న కొండమీద నిర్మింపబడింది శ్రీ సరస్వతీ క్షేత్రం. ఇక్కడ సరస్వతీదేవి నుంచునివుండి, వీణా, పుస్తక, జపమాల ధరించివుంటుంది. దేవికి కుడివైపు ఉపాలయంలో సౌభాగ్యలక్ష్మి, ఎడమవైపు దక్షిణాకాళి కొలువుతీరి వున్నారు.



ఈ దేవాలయం అష్టావధాని అయిన అష్టకళ నరసింహ రామ శర్మ చే నిర్మింపబడింది.ఆలయ ప్రాంగణం లో రెండు గుండాలు ఉన్నాయి వీటిని రాగి,పల కొలనులు అని పిలుస్తారు ఇవి ఎప్పుడు ఎండి పోవడం జరగదు అని చెప్తుంటారు . రాజీవ రహదారి లో హైదరాబాద్ నుండి కరీంనగర్ వెళ్ళే మార్గం లో సిద్దిపేట నుంచి 20 కి మీ దూరం లో ఉంటుంది .



ఉత్సవములు:- ప్రతి సంవత్సరం వసంత పంచమినాడు వార్షికోత్సవాలు జరుగుతాయి. ఆశ్వీజ మాసంలో మూలా నక్షత్రంనుంచి మూడు రోజులపాటు దేవి త్రిరాత్రోత్సవములు జరుగుతాయి.