info.manatemples@mail.com

+91 9866933582

కొలనుభారతి ఆలయం,కర్నూలు జిల్లాలోని కొత్తపల్లి మండలంలో నల్లమలలో





తెలుగునాట చదువులతల్లి సరస్వతి మాత కొలువైన దేవాలయాలు చాలా అరదు .అలాంటిది ఆంద్ర ప్రదేశ్ రాస్ట్రము లోని కర్నూల్ జిల్లా లో దట్టమైన నల్లమల అడువుల్లో కొలువైన పురాతమైన సరస్వతి అమ్మవారి ఆలయం కొలను భారతి ఆలయం .

ఇది కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలంలో ఉంది. ఆత్మకూరు నుండి రోడ్డు మార్గం ద్వారా ఇక్కడకు చేరుకోవచ్చును. పరిసర ప్రాంతలు అత్యంత సుందరంగా ఉంటాయ్. ఇక్కడ సమీపంలో ఒక చిన్న జలపాతం ఉంది. రాజుల కాలంలో నిర్మించిన ఐదు శివాలయాలు శిథిలావస్థలో మనకు దర్శనమిచ్చేవి , వాటిని ఇప్పుడు సుందరంగా తయారుచేశారు, దేశంలో బహు అరుదుగా ఉండే సరస్వతి దేవాలయాల్లో కర్నూలు జిల్లాలోని కొత్తపల్లి మండలంలో నల్లమలలో వెలసి జ్ఞాన సరస్వతి అమ్మవారు కొలువై ఉన్న కొలను భారతి క్షేత్రం ప్రసిద్ధి గాంచింది. రాయలసీమ పరిధిలో ఈ క్షేత్రం అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుని ఉండడంతో ప్రతి ఏడాది వసంత పంచమి వేడుకలు భక్తుల ఆధ్వర్యంలో ఇక్కడ ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ.

ఇక్కడ "శ్రీ చక్ర సంచారిణీ"యంత్రములో ' కొలను భారతి' ప్రతిష్ఠించ బడి ఉన్నారు, జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు ఇ క్షేత్రాన్ని సందర్శించారు స్థల పురాణం ద్వారా తెలుస్తుంది . శ్రీ శైలమునకు పశ్చిమ దిక్కులో ఉన్న ఈ' కొలను భారతీ అమ్మ వారు', చేతిలో వేదములను ధరించి ఉన్న "పుస్తక పాణి" గా కనపడుతుంది. కొలను ప్రక్కన వెలసిన భారతి కావున కొలను భారతిగా పిలువబడుతుంది. కృతయుగంలో సప్త ఋషులు యాగం చేయటానికి వచ్చినప్పుడు వారి సంరక్షణార్థ ము అమ్మవారు ఇక్కడకు వచ్చి స్వయంభువుగా నెలవైంది అని చెప్తారు..
ఏలా వెళ్ళాలి :-
కొత్త పల్లె మండల కేంద్రము నుండి 15 కిలో మీటర్ల దూరములో "శివ పురము" గ్రామాన్ని చేరి అక్కడినుండి 5 కిలో మీటర్లు ప్రయాణించి, "కొలను భారతి కోవెలలను" చేరుకోవొచ్చు.