info.manatemples@mail.com

+91 9866933582

శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయం -బాసర


శరదిందు సమకారే ! పరబ్రహ్మ స్వరూపిని !! వాసర పీట నిలయే ! సరస్వతి నమోస్తుతే !!



ఆదిలాబాద్ జిల్లా లో వెలసిన ప్రసిద్ద చదువుల తల్లి క్షేత్రం బాసర . హైదరాబాద్ నుండి 220 కిమీ దూరం లో ముదోలె మండలం వెలసిన జ్ఞాన సరస్వతి దేవాలయ చాల పురాతనమైనది,సుందరమైనది కూడా. గోదావరి నది వడ్డున వెలసిన ఈ దివ్య మహా క్షేత్రం ఎంతో సుందరంగా ,రమణీయంగా,ఆహ్లాధకారంగా ఉంటుంది .


స్థల పురాణం : సాక్షాత్ శ్రిమనారాయణ స్వారుపుడైన వ్యాసుడు సమస్త తీర్తంలను సేవించుచు మానసిక ప్రశాంతత లబించక గోదావారి నది తీరమున గల సరోవరమును చేరి,సరస్వతి నిలయమైన సరవోరమున స్నానం ఆచరించి దేవి ఆలయమున ప్రవేశించి శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మ వారిని బహు రకాలుగా స్తోత్రించెను.వ్యాసుని స్తుతికి ప్రసన్నురాలైన అమ్మ వారు ప్రత్యక్షమై వ్యాసునికి సరస్వతి సాయుజ్యము ,ముక్తి లబింపగలవని అనుగ్రహించెను వ్యాసుడు క్షేత్రమున నివశించి తపమాచరించిన కారణముగా ఈ ప్రాంతమును వ్యాసపురి గ ..కాల క్రమేనా అది బాసర (వాసర) గా ప్రసిద్ది చెందినది .


వేదమాత ఆయన సరస్వతి , సాక్షాత్ శ్రిమన్నయరణ స్వరూపుడైన వేద వ్యాసుడు,పవిత్ర గోదావరి నది తీరము - ఈ మూడు విశెసముల వలన ఈ క్షేత్రం వేద నిలయమై శోబిల్లుచున్నది .












వెళ్ళే మార్గం : హైదరాబాద్ నుండి 220 కిమీ దూరం లో ముదోలె మండలం , బాసర