info.manatemples@mail.com

+91 9866933582

శ్రీ విద్య సరస్వతి దేవాలయం - వర్గల్


శరదిందు సమకారే ! పరబ్రహ్మ స్వరూపిని !! వాసర పీట నిలయే ! సరస్వతి నమోస్తుతే !!



సికింద్రాబాద్ నుంచి 47 కి మీ దూరం లో ఉన్న శ్రీ విద్య సరస్వతి దేవాలయం లో ప్రతి సంవత్సరం వసంత పంచమి,నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి . ఈ దేవాలయం కంచి శంకర మఠం ద్వారా నిర్వహింపబడుతున్నది. ఈ ఆలయ ప్రాంగణ నిర్మాణం సరస్వతీ ఆరాధకుడైన యాయవరం చంద్రశేఖర శర్మ ఆలోచన ఫలితంగా నిర్మితమైనది. నవరాత్రి ఉత్సవాలలో మూలా నక్షత్రం (సరస్వతీ దేవి జన్మ నక్షత్రం) లో విశేష దినంగా భావించి సరస్వతీ దేవికి విశేష పూజలు జరుగుతాయి. ఈ దినం ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి.

ఈ దేవాలయం వర్గల్ గ్రామ సమీపంలోని కొండపై ఉన్నది. ఈ కొండపై ఈ క్రింది దేవతల దేవాలయాలు కూడా ఉన్నాయి.
• శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం
• శ్రీ విద్యా సరస్వతీ దేవాలయం
• శనీశ్వరుని దేవాలయం
• శివాలయం
• కొన్ని శిధిలావస్థలో ఉన్న వైష్ణవ దేవాలయాలు.
వెళ్ళు మార్గం :- ప్రతి 10 నిముషాలకు టి.ఎస్.ఆర్.టి.సి బస్సులు జూబ్లీ బస్ స్టేషను నుండి అందుబాటులో ఉంటాయి. అన్ని బస్సులు సిద్దిపేట, కరీంనగర్, మంచిర్యాల, వేములవాడ మీదుగా పోతాయి. ఈ బస్సులు వర్గల్ క్రాస్ రోడ్డువద్ద ఆగుతాయి. ఈ క్రాస్ రోడ్డు నుండి వర్గల్ గ్రామం 5 కి.మీ దూరం ఉంటుంది. బస్సులు లాల్ బజార్ మరియు అల్వాల్ లో