నాగోబా దేవాలయం - కేస్లాపూర్
వేదాలు, ఇతిహాసాల కాలం నుంచి నేటి వరకు మానవ జీవితాలతో సర్పాలకు విడదీయరాని బంధం ఉంది. కొన్ని సందర్భాల్లో నాగదేవతగా పూజలందుకుంటే, మరికొన్ని వేళల్లో ప్రాణాలు తీసే విషనాగుగా ప్రజల ఆగ్రహానికి కారణం అవుతుంది.
ఆదిలాబాద్ జిల్లా ముట్నూరు గ్రామానికి సమీపం లో కీస్లాపూర్ గ్రామం లో వెలసిన నాగ దేవత ఆలయం ఎంతో ప్రసిద్దిగంచింది .
ఈ ప్రాంతమంతా గిరిజనులు ఉండే ప్రదేశం .వారి ఆరాధ్య దేవత నాగోబా . నాగోబా అంటే సర్పదేవత .
నాగుపామును చాలామంది అరాదిస్తారు .నాగ పంచమి ,నాగుల చవతి లాంటి పర్వ దినాల్లో ఇక్కడ
దేవి కి ఘనంగా పూజలు అభిషేకాలు జరుపుతారు . ఉదయం లేచింది మొదలు రాత్రి రాత్రి నిద్రించేవరకూ అడువుల చుట్ట తిరుగాలి కనుక పాములతో సహచర్యం తప్పదు అందుకీ పిల్లలకు ,పెద్దలకు విష సర్పాల నుండి ఎలాంటి హాని జరుగకూడదు అని ,సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ నాగ దేవతను పుజిస్త్తారు .
ఇక్కడ జరిగే జాతరకు వాడే కుండలను ఒకే వంశానికి చెందినా వాళ్ళు తాయారు చేస్తుంటారు . ఆ వంశానికి చెందినా ఏడుగురు కాలి నడకన గోదావరి తీరం చేరి అక్కడ కలమడుగు గ్రామ సమీపంలోని హస్తిన మడుగు లో జలాన్ని తీసుకోని ఇంద్రవెల్లి సమీపం లో ని దేవాలయాన్ని సందర్శించి కేస్లాపూర గ్రామా సమీపం లో మర్రి చెట్టు దగ్గర మూడు రోజులు బస చేసి పిత్రు దేవతలందరికీ పూజ కార్యక్రమాలు నిర్వహించి నాగోబా దేవాలయానికి బయలుదేరుతారు . రాత్రి 10 గంటలకు గంగ జాలం తో దేవాలయాన్ని శుద్ధి చేసి పూజ కార్యక్రమాలు ప్రారంబిస్తారు .
పుష్య మాసం లో ఇక్కడ నాగోబా తల్లి జాతర ఉత్సవాలు జరుగుతాయి . అది చూడడానికి లక్షల మంది భక్తులు వస్తారు. 9 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలు చాల ఘనంగా, ఇక్కడ ఉండే వివిధ రకాల జాతుల సంస్కృతిని ప్రతిబింబెంచే వీదంగా నిర్వహిస్తారు. ఇక్కడ జరిగే జాతరకి వివిధ రాష్ట్రాల్లో నుంచి భక్తులు తరలి వచ్చి నాగమ్మ తల్లిని కోరుకుంటారు . ఎంతో భక్తీ శ్రద్ధ లతో నాగ దేవత కు పూజ కర్యాక్రమాలు ,నైవిద్యాలు సమర్పిస్తారు .