info.manatemples@mail.com

+91 9866933582

ఆదిత్య హృదయం



రామాయణంలో రాముడిని కార్యోన్ముఖుడిని చేసేందుకు ఆదిత్య హృదయాన్ని సప్త రుషుల్లో ఒకరైన అగస్త్యుడు ఉపదేశించారు. రామాయణంలోని యుద్ధకాండ. లంకలోకి అడుగుపెట్టిన రాముని ఎదుర్కొనేందుకు, రావణుడు భీకరమైన రాక్షసులందరినీ యుద్ధభూమికి పంపాడు. అలా తన మీదకు వచ్చినవారిని వచ్చినట్లుగా సంహరిస్తున్నాడు రాముడు. ఒకపక్క వారితో యుద్ధం చేస్తున్న ఆయన శరీరం అలసిపోతోంది. అంతకుమించి తన కళ్లెదుట జరుగుతున్న మారణహోమాన్ని చూసి మనసు చలించిపోతోంది. దాంతో యుద్ధం పట్ల విముఖత మొదలైంది. దీన్ని గమనించిన అగస్త్య మహాముని.. ఆదిత్యునిని ప్రార్థించమని చెప్తారు. ఆయనను ప్రార్థిస్తే ఎనలేని శక్తి లభిస్తుందని.. అంతులేని విజయాలు పొందవచ్చునని సూచిస్తాడు. అలా చెప్తూ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని లోకానికి అందించారు.. అగస్త్య ముని. ఈ ఆదిత్య హృదయంలో 30 శ్లోకాలుంటాయి. మొదటి ఆరు శ్లోకాలు ఆదిత్య పూజ కోసం. ఏడో శ్లోకం నుంచి 14వ శ్లోకం వరకు ఆదిత్య ప్రశస్తి వుంటుంది. 15వ శ్లోకం నుంచి 21 వరకు ఆదిత్యుని ప్రార్థన, 22వ శ్లోకం నుంచి 27వరకు ఆదిత్య హృదయాన్ని పఠిస్తే కలిగే శుభాల గురించి వర్ణన వుంటుంది. ఇదంతా విన్న రాముల వారు కార్యోన్ముఖులు కావడాన్ని 29,30 శ్లోకాల ద్వారా గమనించవచ్చు.