info.manatemples@mail.com

+91 9866933582

శ్రీ సూర్య నారాయణ స్వామి దేవాలయం - అరసవెల్లిా





శ్రీసూర్యనారాయణ దేవాలయాలు భారత దేశం లో చాల అరుదుగా ఉన్నాయి . శ్రీకాకుళం పట్టణానికి 2 కి మీ దూరం లో ఉన్న అరసవెల్లి లో వెలసిన ప్రసిద్ద సూర్య దేవాలయం . అరసవెల్లి సూర్య నారాయణ స్వామి దేవాలయం .


శ్రీ మహావిష్ణువు అవతారమైన బలరాముడు ద్వాపర యుగమ లో జీవులనుద్దరించేందుకు తన నాగేటి చాలు తో నాగావళి నదిని ఆవిర్బవింప చేసి ఆ తీరాన దేవాలయాన్ని ప్రతిష్టించారు అని గాథ . దీనిని తిలకించడానికి దేవతలు స్వర్గమా నుంచి వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు అట . ఇంద్రుడు ఒక్కడు వేళా కు రాలేకపోయాడు . రాత్రి సమయాన చేరుకొని కోటిశ్వర దర్శనార్థం రాగ నందీశ్వరుడు ఆటకయించాడు .ఇంద్రుడు కోపావేశం తో వజ్రాయుధం ఎత్తగా నందీశ్వరుడు తన కొమ్ములతో దానిని విసిరిపరేసదట . ఆ దెబ్బకు ఇంద్రుడు స్పృహ తప్పి అరసవెల్లి ప్రాంతం లో పడిపోగా స్వప్నం లో ఇంద్రుడికి సూర్య భగవానుని విగ్రహం ప్రతిష్టించి ఆరాధించమని సందేశం రాగ ఇంద్రుడు అలాగే చేసి ఆరోగ్యవంతుడై తిరిగి తనలోకనికి చేరుకున్నాడని స్థల పురాణం . ఈ క్షేత్ర స్వామి గ్రహదిపతి కావడం వాళ్ళ దర్శన మాత్రమునే సర్వగ్రహహరిస్తా శాంతి లబిస్తుంది అని పురాణాలూ చెబుతున్నాయి .


ఈ దేవాలయాన్ని 7 వ శతాబ్దం లో కళింగరాజులు నిర్మించినట్లు శాసనాల ఆధారం. సంవత్సరానికి రెండు పర్యాయాలు సూర్య కిరణాలు ఉదయసంధ్యలో మూలవిరాట్టు పాదాలకు సోకేలా ఈ దేవాలయం నిర్మించబడటం. దేవాలయ వాస్తులో యిదో ప్రత్యేకత. కంచి లోని కామేశ్వరాలయంలో కూడ యిలాంటి ఏర్పాటు వుంది. ప్రతి సంవత్సరం రథసప్తమినాడు స్వామికి ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు అరసవల్లి దేవస్థానం ప్రాంగణం అనివెట్టి మండపం, ధ్వజస్తంభం నుంచి సుదర్శన ద్వారం మధ్యలో తొలి కిరణాలు గర్భగుడిలోకి మాలవిరాట్టు ఆదిత్యుని శిరస్సును సృశిస్తాయి.



ఆదిత్యునిని సూర్యకిరణాలు తాకిన వైనాన్ని తిలకించేందుకు తండోపతండాలుగా భక్తకోటి అరసవల్లికి తరలివస్తారు. సకల జీవులకూ సంక్షేమాన్ని, ఆయురారోగ్యాలనూ, ప్రసాదించే ఈ స్వామివారి ఇరు చేతులూ అభయ ముద్రలోనే ఉంటాయి. అరసవల్లి క్షేత్రాన్ని ఆరోగ్య క్షేత్రంగానూ స్థానికులు పిలుస్తుంటారు. ప్రత్యేకించి బొల్లి, కంటి వ్యాధులు, కుష్టు, వ్యాధులతో పాటు ఇతర మానసిక, శారీరక రోగాల నుంచి విముక్తి కోసం బాధిత భక్తులు ఇక్కడికొచ్చి స్వామి వారిని దర్శించుకుంటుంటారని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు.















Route Map: