info.manatemples@mail.com

+91 9866933582

ప్రత్యంగిరా దేవి దేవాలయం,రామకృష్ణాపురం




హైదరాబాద్లోని దిల్సుఖ్నగర్ ప్రాంతంలో (రామకృష్ణాపురం రోడ్ నెంబర్ 1, అష్టలక్ష్మీ ఆలయ సమీపంలో)ని కుర్తాళం పీఠంలో ప్రత్యంగిరాదేవి ఆలయాన్ని సుమారు 10 సంవత్సరాల క్రితం నిర్మించారు . అమ్మ ఉగ్రస్వరూపిణి కావడంతో అమ్మ వారి దేవాలయాలు చాల తక్కువ , మన దేశం లో చాల తక్కువ ప్రదేశాల్లో మనము అమ్మ వారి దేవాలయాలను చూడవచ్చు


ములుగు మల్లికార్జునరావు గత నలభయ్యేళ్లుగా ఎన్నో గ్రంథాలు పరిశీలించి ప్రత్యంగిరాదేవి గురించి ఎన్నో వివరాలు తెలుసుకున్నారు. మానససరోవరం, కుంభకోణంలో కొలువైన ఆ ఉగ్రస్వరూపిణిని దర్శించి పూజాదికాలు నిర్వహించారు. కుర్తాళం పీఠంలో ప్రత్యంగిరాదేవిని ప్రతిష్ఠించారు. ఆ అమ్మతో పాటు ఆదిపరాశక్తి సాత్విక, రౌద్ర అంశలుగా భావించే కాళి, తార, చిన్నమస్తా, త్రిపుర భైరవి, భగళాముఖి, ధూమావతి, మాతంగి, షోడశి(లలితాత్రిపురసుందరి), కమలాత్మిక (లక్ష్మీదేవి) అమ్మవార్లనూ ప్రతిష్ఠించారు.



సృష్టి ఆరంభంలో దేవతలకూ దానవులకూ యుద్ధం జరుగుతున్నప్పుడు విష్ణుమూర్తి ఒక రాక్షసుణ్ని సంహరించడానికి తన సుదర్శన చక్రాన్ని సంధించాడట. సుదర్శన చక్రం ఆ రాక్షసుణ్ని ఏమీ చేయలేక తిరిగి వచ్చిందట. ఆ సంగతి తెల్సుకుని శివుడు కోపంతో తన త్రిశూలాన్ని ప్రయోగించాడట. ముక్కంటి త్రిశూలం కూడా విఫలమవడంతో విజయగర్వంతో ఆ రాక్షసుడు శివకేశవుల వెంటపడ్డాడట. దాంతో వారిద్దరూ తమకిక ఆదిపరాశక్తే దిక్కని తలచి ఆ తల్లిని ప్రార్థించారట. అప్పుడు ఆదిపరాశక్తి లక్షసింహముఖాలతో అతిభయంకరంగా ఆవిర్భవించి రాక్షసుడినీ అతని సైన్యాన్నీ సంహరించిందట.



లోకభీకరంగా వెలసిన అమ్మవారిని చూసి దేవతలంతా భయంతో పారిపోయారనీ అందుకే ప్రత్యంగిరా దేవికి పూజాదికాలు నిర్వహించే ఆచారం అంతగాలేదనీ ఐతిహ్యం.
శత్రు సంహారం , ధరిద్ర్యనివరణ , మంచి ఆరోగ్యం కోసం ప్రత్యంగిరా దేవి ని పుజిస్తారు . సనేస్వరుడి శంకం పేరు ప్రత్యంగిరి ,ఏలినాటి శని దోషం తో బాధపడే వారు ప్రత్యంగిరా దేవి ని పూజిస్తే మంచిది అని చెబుతారు. నిత్యం లలితాసహస్రనామం చదివేవారిని దుష్టగ్రహ పీడల నుంచి కాపాడేది ప్రత్యంగిరా దేవేనని భక్తుల విశ్వాసం.




Sri Prathyangira Temple
Kurtalam Pitam, Road No. 1, Cross Road 4
Sri Rama Krishnapuram
Near Dilsuknagar
Hyderabad – 500 035