వరసిద్ది వినాయక దేవాలయం - అయినవిల్లి
కోనసీమ అందాలూ , ప్రశాంత వాతావరణం ,పచ్చని చెట్లు ,చిన్న చిన్న సెలయేర్ల మద్య ఎంతో ఆహ్లాదకార వాతావరణం లో వెలసిన ఎంతో మహిమన్మితామైన క్షేత్రం అయినవిల్లి సిద్ది వినాయక స్వామి దేవాలయం తూర్పు గోదావరి జిల్లా రాజముండ్రి కి 60 కి మీ దూరం లో అమలాపురం నుండి 14 కి మీ దూరం లో ఉన్న అయినవిల్లి వినాయక దేవాలయం చాల పురాతనమైనది మరియు ప్రసిద్ది చెందినా క్షేత్రం .
ఇక్కడ వెలసిన స్వయం భు గణపతి అత్యంత మహిమన్మితుడు.దక్ష ప్రజాపతి దక్ష యజ్ఞం నిర్వర్తించేందుకు విగ్ననయకుడైన వినాయకుణ్ణి పూజించి పునీతుడైనట్లు క్షేత్రం పురాణం చెబుతుంది . వ్యాస మహర్షి దక్షిన యాత్ర ప్రారంబం లో ఇక్కడ గణపతి ని ప్రతిష్టించినట్లు కూడా ఒక పురాణం ఉంది . స్వామి వారి దర్శనం వలన సిద్ది బుద్ది లబిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడి ఆలయంలో పూజలు శైవ ఆగమశాస్త్రానుసారంగా జరుగుతాయి.
పవిత్ర గోదావరి నది పాయ లో స్నానం చేసి స్వామి వారిని దర్శించుకుంటారు. ఇక్కడ స్వామి వారు దక్షినబిముఖంగా ఉండడం వలన ఇక్కడ స్వామి వారి ని దక్షిణ సింహ ద్వారం ద్వారా,తూర్పు సింహద్వారం ద్వార దర్శనం చేసుకోవొచ్చు.ఈ జిల్లా వాసులు ఏదైనా కార్యక్రమం చేయాలి అంటే ముందు ఇక్కడ విజ్ఞేశ్వర స్వామి దర్శనం చేసుకొని ప్రారంబిస్తారు.అలా చేయడం వాళ్ళ అంతా మంచి జరుగుతుంది అని వాళ్ళ విస్వాశం.
ఈ ఆలయ ప్రాంగణం లో
శ్రీదేవి ,భూదేవి సమేత చెన్న కేశవ స్వామి దేవాలయం
కాల భైరవాలయం
విశ్వేశ్వరాలయం
అన్నపూర్ణా దేవి ఆలయం ఉన్నాయి. క్షేత్ర పాలకుడు శ్రీ కాల భైరవ స్వామి ఈశాన్య దీషలో ప్రతిస్టించబడ్డాడు .
ఇక్కడ జరిగే ప్రత్యేక కార్యక్రామాలు
--------------------------------------------
శివ కేశవులురికి వైశాక శుద్ధ ఏకాదశి నుండి పంచహిణిక దీక్ష తో కళ్యాణాలు చేస్తారు .
వినాయక చవితి,
క్రిష్ణస్తామి ,
విజయ దశమి ,
మహా శివరాత్రికి ఉత్సవాలు చేస్తారు .
వెళ్ళు మార్గం
---------------------
అమలాపురం నుండి 12 కి మీ దూరం లో ఈ క్షేత్రం ఉంది.
రాజముండ్రి నుండి సుమారు 60 కి మీ దూరం లో ఈ క్షేత్రం ఉంది