రాక్ ఫోర్ట్ గణపతి దేవాలయం- టెప్పాకులం
తమిళనాడు రాష్ట్రము, తిరుచిరాపల్లి జిల్లా, టెప్పాకులం అనే ప్రాంతంలో రాక్ ఫోర్ట్ దేవాలయం ఉంది. ఈ ఆలయంలోనే వినాయకుడు కొండపైన స్వయంభుగా వెలిసాడు. తిరుచిరాపల్లినే ట్రిచీ అని అంటారు. అయితే రాక్ ఫోర్ట్ క్రింది భాగమున బ్రహ్మాండమైన కోనేరును నిర్మించారు దీన్ని తెప్పకుళం అంటారు. ఈ రాక్ ఫోర్ట్ కొండ భూమట్టం నుండి సుమారు 272 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ కొండకి దక్షిణ దిక్కున రాతిమెట్లు కట్టబడ్డాయి. ఇచట ఒక రాతి లింగం ఉంది భక్తులు దీనిని మలైకొళుందిశ్వర్ అని పిలుస్తారు. ఒకే ఒక పెద్ద శిల నుండి పల్లవ శిల్పులు ఈ దేవాలయాన్ని అధ్బుతంగా మలిచారు.