కాణిపాక వరసిద్ది వినాయక దేవాలయం - కాణిపాకం
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి నుండి 39 కి మీ దూరం లో ఉన్న బిక్కవోలు గ్రామం లో వెలసిన గోలింగేశ్వర స్వామి దేవాలయం ఎంతో పురాతనమైనది . చాళుక్యుల కాలమా లో నిర్మించిన ఈ దేవాలయం లో శివుడు వెలసిన క్షేత్రం ఇది. ఈ గ్రామంలో తూర్పు చాళుక్యుల కాలానికి చెందిన అనేక మందిరాలున్నాయి.
11 అడుగుల గణేశ విగ్రహం తూర్పు చాళుక్యులనాటి విగ్రహాలన్నింటికంటే పెద్దది. కొంతకాలం రెండు చేతులతో ఉన్న ఈ విగ్రహానికి గుణగవిజయాదిత్యుని కాలంలో మరో రెండు చేతులు చెక్కబడినాయి సాతలూరులో లభించిన గుణగ విజయాదిత్యుని ముద్రికపై ఈ విధమైన గణేశమూర్తి, మరోవైపు లక్ష్మీదేని మూర్తి ఉన్నాయి. వినాయక చవితి కి విశేషమైన పూజ కార్యక్రమాలు నిర్వహించాబడుతాయి .
వెళ్ళు మార్గం :-
------------------
రాజమండ్రినుండి (39 కి.మీ.), కాకినాడ (31 కి.మీ.) నుండి బిక్కవోలుకు తరచు బస్సు సౌకర్యం ఉంది.