మహా గణపతి ఆలయం- కాసారగాడ్
కేరళ రాష్ట్రంలోని కాలికట్ కు దగ్గరలో కాసారగాడ్ అనే ఊరిలో మహా గణపతి ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని మధురాలయం అని అంటారు. ఈ ఆలయంలో వినాయకుడు స్వయంభూగా వెలిశాడని ప్రసిద్ధి. ఈ ఆలయంలో కేరళ సంప్రదాయ వంటకమైన అప్పాన్ని ప్రసాదంగా ఇస్తారు. ఇలా ప్రకృతి రమణీయతల మధ్య వెలసిన ఈ ఆలయంలోని వినాయకుడు రోజు రోజుకి ఎత్తు పెరగడం భక్తులని ఆశ్చర్యానికి గురి చేస్తూ విశేషంగా ఆకట్టుకుంటుంది.అప్పట్లో తుర్కల దండయాత్ర లో దేవాలయం కొంత దెబ్బతిన్న గర్భాలయం మాత్రం చెక్కు చెదర లేధు .
ప్రతి నిత్యం స్వామి కి జరిగే సేవ కార్యక్రమాలతో పాటు వినాయక చతుర్థి కి విశేషమైన పూజలు నిర్వహించబడుతాయి .