info.manatemples@mail.com

+91 9866933582

సంకటహర సిద్ధి విద్యాగణపతి ఆలయం,రుద్రారం




భాగ్యనగరానికి అతి చేరువలో కొలువైన ప్రసిద్ద శక్తివంతమైన గణపతి దేవాలయం. మెదక్ జిల్లా పటాన్‌చెరుకు అతి చేరువలోని రుద్రారంలో స్వయంభువుగా వెలసిన శ్రీ సంకష్ట హరసిద్ధి విద్యాగణపతి ఆలయం ఉంది. వందల ఏళ్లనాటి ఈ ఆలయం భక్తులకు కొంగు బంగారం. ఇక్కడి స్వామి విగ్రహంపై ఉదరంతోపాటు చేతులకు కూడా నాగబంధం ఉండడం విశేషం. ఈ వినాయకుడిపై శ్రీచక్ర బీజాక్షరాలు ఉండడంతో ఆ శక్తిని సామాన్యులు తట్టుకోవడానికి వీలుగా స్వామివారికి రోజూ సిందూర లేపనం చేస్తారు. ఇక్కడి స్వామి విద్యాగణపతి కూడా కావడంతో అనేకమంది స్వామివారికి ప్రదక్షిణలు చేసి దర్శించుకుని విద్యా సముపార్జనగావిస్తారు. ప్రతి నిత్యం స్వామి వారికి జరిగే పూజా కార్యక్రమాలతో పాటు సంకట హర చతుర్థి,గణపతి నవరాత్రులప్పుడు విశేషమైన సేవ లు నిర్వహిస్తారు .నగరానికి అతి సమీపం లో ఉన్నందున ప్రతి ఒక్కరూ తప్పకుండా దర్శించాల్సిన ప్రదేశం .