info.manatemples@mail.com

+91 9866933582

ముండ్ కటియ గణపతి దేవాలయం –సోన్ ప్రయాగ్ కి 3 కి మీ దూరం




కేదారనాథ్ వెళ్ళే మార్గం లో సోన్ ప్రయాగ్ కి 3 కి మీ దూరం లో మంధకాని నది తీరం లో కొలువైన ఈ దేవాలయం లో వినాయకుడు తల బాగం లేకుండా దర్శనం ఇస్తాడు. యెంతో పురాతనమైన ఈ దేవాలయను mundkatiya దేవాలయంగా పిలుస్తారు .

దేవభూమి గా పిలువబడే ఈ ప్రదేశం లోని ఇ దేవాలయం గురుంచి శివ పురాణం లో చెప్పడం జరిగింది . శివ దేవుడు బాలుడి రూపం లో ఉన్న గనేషుడి తలకాయ ఖండించిన ప్రదేశం ఇదే అని స్థలపురాణం ద్వారా తెలుస్తుంది . ముండ్ అంటే తల కటియ అంటే కండించడం అని అర్థం . కేదారనాథ్ వెళ్ళే ప్రతి ఒక్కరూ తప్పకుండా ఇక్కడ ఆగి స్వామి వారి ఆశీస్సులు తీసుకుంటారు . చాలా దివ్యమైన క్షేత్రం ప్రతి ఒక్కరూ తప్పకుండా దర్శించాల్సిన ప్రదేశం కూడా !