info.manatemples@mail.com

+91 9866933582

దశభుజ శ్రీ మహా గణపతి- రాయదుర్గం




రాయదుర్గం దశభుజ శ్రీ మహా గణపతి అనంతపురం జిల్లాలోని రాయదుర్గంలో మూడు గణపతి ఆలయాలున్నాయి. వాటిలో రాయదుర్గం కొండపైకి వెళ్లే మార్గంలో కోట మెట్ల కింద ఆత్మకూరు వీధిలో ఉన్న దశభుజి గణపతి ఆలయం ప్రముఖమైనది. 4 మీటర్ల కొండరాయిపై మలచిన వినాయకుని రూపం భక్తుల్ని అమితంగా ఆకట్టుకుంటుంది. సుమారు 15 అడుగుల ఎత్తైన రూప ంలో పది చేతులు గల వినాయకుడిని ఎంతో నేర్పు గా మలిచారు. ఈ విగ్రహంలో వినాయకుడి తొం డం కుడివైపు తిరిగి ఉంటుంది. ప్రతి నిత్యం స్వామి వారికి జరిగే పూజా కార్యక్రమాలతో పాటు వినాయక చతుర్థి కి విశేషమైన పూజలు నిర్వహిచబడుతాయి.