నరముఖ గణపతి దేవాలయం
మన దేశం లో వినాయకునికి రక రకాల ఆలయాలు కొలువై ఉన్నాయి.కానీ నరముఖ గణపతి ఆలయం చాలా అరుదైన దేవాలయం.మనకు ఇలాంటి దేవాలయం ఇంకా యెక్కడ కనిపించదు.
తమిళనాడు రాష్ట్రంలో, తిలతర్పణపురి అనే గ్రామంలో స్వర్నవల్లి సమేత ముక్తీశ్వారర్ ఆలయం ఉన్నది.ఇక్కడ వెలసిన వినాయకుడు తొండం లేకుండా మానవ రూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. ఈవిధంగా వెలసిన గణపతిని నరముఖ గణపతి లేదా ఆది వినాయకర్ గణపతి అని చాలా ప్రసిద్ధి చెందినది. ఈవిధంగా వినాయకుడు మానవ రూపంలో దర్శనమిచ్చే ఏకైక ఆలయం ఇదేనని చెప్పవచ్చు.
స్వామి వారికి ప్రతి నిత్యం జరిగే కార్యక్రమాలతో పాటు వినాయక చవితికి విశేషమైన సేవాలు నిర్వైంచబడుతాయి .ప్రతి ఒక్కరూ తప్పకుండా దర్శించాల్సిన క్షేత్రం .
దేవభూమి గా పిలువబడే ఈ ప్రదేశం లోని ఇ దేవాలయం గురుంచి శివ పురాణం లో చెప్పడం జరిగింది .
శివ దేవుడు బాలుడి రూపం లో ఉన్న గనేషుడి తలకాయ ఖండించిన ప్రదేశం ఇదే అని స్థలపురాణం ద్వారా తెలుస్తుంది . ముండ్ అంటే తల కటియ అంటే కండించడం అని అర్థం .
కేదారనాథ్ వెళ్ళే ప్రతి ఒక్కరూ తప్పకుండా ఇక్కడ ఆగి స్వామి వారి ఆశీస్సులు తీసుకుంటారు . చాలా దివ్యమైన క్షేత్రం ప్రతి ఒక్కరూ తప్పకుండా దర్శించాల్సిన ప్రదేశం కూడా !