info.manatemples@mail.com

+91 9866933582

శ్వేతార్కమూల గణపతి దేవాలయం,కాజీపేట,వరంగల్ జిల్లా




మహా గణపతి మనకు వివిధ రూపాలలో కనిపిస్తాడు . కానీ మనము చాల అరుదుగా చూసే రూపం శ్వేతార్కమూల గణపతి రూపం .


వరంగల్ జిల్లా కాజీపేట పట్టణం లో స్వయం భుగ వెలసిన శ్వేతార్కమూల గణపతి స్వామి వారి దేవాలయం గరికలతో ప్రదిక్షణలు చేస్తే కోరిన కోరికలను నెరవేరుస్తూ వెలసిన కొంగు బంగారం. ఇక్కడ వెలసిన స్వామి ని కార్యసిద్ధి వినాయకుడు అని కూడా పిలుస్తారు.


"శ్రీ స్వామి వారిని సరిగ్గా తూర్పు ముకంగా కూర్చుండచేస్తే స్వామి వారి చూపు ఈశాన్యం వైపునాకు కైలాష స్థానాన్ని చూస్తున్నట్టుగా సమస్త వాస్తుదోష నివారకుడిగా ఉండటం ఈ స్వామి లోని విశిష్టత. ఎలాంటి చేక్కడములు,మల్చడములు లేకుండా తెల్ల జిల్లేడు చెట్టు వేరునకు ఆకృతిని పొంది దర్శనమిచ్చాడు.


ఈ దేవాలయం లో స్వామి వారితో పాటు అనేక దేవతముర్తులు కొలువై ఉన్నారు
శ్రీ మహాలక్ష్మి అమ్మవారు,శ్రీ జ్ఞానముద్ర సరస్వతి అమ్మవారు,శ్రీ సంతోషిమాత శ్రీ సంతానా నాగలింగేశ్వర స్వామి ,వెంకటేశ్వర స్వామి ,ఆంజనేయ స్వామి,సత్యనారాయణ స్వామి,నవగ్రహలయలు ఉన్నాయి


ప్రత్యేకంగా జరుగు కర్యాక్రమాలు :
వైశాక శుద్ధ పంచమి -స్వామి వారి వార్షిక వసంతోత్సవములు
నవరాత్రి ఉత్సవాలు ,దసరా ఉత్సవములు బాగా జరుగును .

వెళ్ళు మార్గం :


హైదరాబాద్ నుండి వరంగల్ వెళ్ళు మార్గం లో కాజిపేట్ లోని విష్ణుపురి లో ఈ దేవాలయం ఉంది . హైదరాబాద్ నుండి సుమారుగా 135 కి మీ దూరం లో ఉంటుంది .