సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి సమీపం లో వెలసిన శ్రీ గణపతి దేవాలయం వంద సంవత్సరాలకు పైన చరిత్ర గల మహిమన్మితమైన, శక్తివంతమైన దేవాలయం . ఈ క్షేత్రం లో వెలసిన విఘ్నేశ్వరుడు కరుణ కటాక్షలతో నమ్మిన వారికి శుబములు ప్రసాదిస్తాడు
18వ శతాబ్దం లో బ్రిటిషు కాలం లో ఒక పాత బావి తోవ్వకల్లో లబించగా నిర్మించిన ఈ దేవాలయం దిన దినబిరుద్ది చెందుతుంది. 1932 సంవత్సరం లో ఈ దేవాలయ ఆవరణ లో శ్రీ వల్లిసేన సుబ్రమణ్య స్వామి దేవాలయమ ,శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం ,శ్రీ అధిత్యాది నవగ్రహాలను ప్రతిస్టించాబడ్డాయి .
శ్రీ గణపతి ఆలయం లో ఉన్న స్వామి వారు అత్యంత మహిమన్మితులు . కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం స్వామి వారు . ఈ ఆలయం లో ప్రతి నిత్యము సత్య గణపతి వ్రతము జరుగుతుంది .
భాద్రపద శుద్ధ చతుర్థి నుండి పౌర్ణమి వరకు గణపతి నవరాత్రులు నిర్వహించడం జరుగుతుంది . ప్రతి కృతిక నక్షత్రమున శ్రీ సుబ్రమణ్య స్వామి కి , హనుమాన్ జయన్తి సందర్భంగా ఆంజనేయ స్వామి కి , దసరా సందర్భంగా శ్రీ ఉమా మహేశ్వరీ దేవి కి విశెసమైన పూజ కార్యక్రామాలు నిర్వహించడం ఈ ఆలయ విశెశము.
ఆలయం లోని రాజ గోపురం , మహామండప నిర్మాణము, శ్రీ వారి విమాన గోపుర నిర్మాణాలు , శ్రీ గణపతి స్వామి జన్మవ్రుత్తంతము మొదలగు వివరములు చాల విశేషంగా ఆకట్టుకుంటాయి .